Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:57 AM

జిల్లా టాపర్‌గా తాటి స్పందనగౌడ్

జిల్లా టాపర్‌గా తాటి స్పందనగౌడ్

జిల్లా టాపర్‌గా తాటి స్పందనగౌడ్
April 21, 2026 04:11 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కన్నాయిగూడెం,

మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన తాటి స్పందనగౌడ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (ఎంఫీసీ) 470 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.

కనకసేన గౌడ్, సరిత దంపతుల కుమార్తె అయిన స్పందనగౌడ్ సాధించిన ఈ ప్రతిభ మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం కన్నాయిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఇంటి వద్ద ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం మండల అధ్యక్షుడు పాలకుర్తి శ్రీధర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు తాటి లచ్చాలు గౌడ్, నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, ముప్పెనపల్లి కేజీబివి లో చదివి జిల్లా టాపర్‌గా నిలవడం అభినందనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తాటి రాజశేఖర్ గౌడ్, మారగోని రాజు గౌడ్, తాటి యాదగిరి గౌడ్, మారగోని శంకరయ్య గౌడ్, ముక్కెర సమ్మయ్య గౌడ్, ముక్కెర రాజు గౌడ్, ముక్కెర స్వామి గౌడ్, కోడూరు బాలుగౌడ్, చీకటి రాజు గౌడ్, కోడూరు చంటి గౌడ్, పానగంటి విక్రమ్ గౌడ్, తాటి కోటేష్ గౌడ్, శ్రీశాంత్ గౌడ్, తాటి మణి హార్శిత్ గౌడ్, తాటి మొక్సిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News