Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

11-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులలతో కలిసి అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.

జిల్లాలో మహిళల అభివృద్ధి, భద్రత, సాధికారత కోసం అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహరావు, పౌర సరఫరాల అధికారి రోజారాణి, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా మహిళలను సత్కరించి అభినందించారు.

Sthanikam

జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News