Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన
11-03-2026 259 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూకట్‌పల్లి, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్‌పల్లి కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని, నిత్య జీవితంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్, కెరీర్ విశ్లేషకుడు, బ్లాగిస్ట్ డా. ఎ. దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన డిగ్రీ అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాటికి అవసరమైన వనరులు, మీడియా లింకులను విద్యార్థులకు వివరించారు. కెరీర్ ఎంపికలో సరైన దిశలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.

కెరీర్ గైడెన్స్ సెల్ బాధ్యులు ప్రొ. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దిశను నిర్దేశించేందుకు ప్రిన్సిపాల్ మద్దతుతో ఇలాంటి తరగతులను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మ, ఉమా, శర్మ, సుధీర్, లహారి, అర్చనతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా వినుతూ విజయవంతం చేశారు.

Sthanikam

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News