Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:21 PM

ఢిల్లీ లో యువతపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం

23-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డిల్లీ ఘటనలు, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ధర్నా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నీట్ అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ, బాధితులకు మద్దతుగా ప్రధాని నివాసం వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ గురువారం భారీ ధర్నా నిర్వహించింది.ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో మండల, మున్సిపల్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో నాయకులు వలిగొండ రోడ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో బైఠాయించి నిరసన తెలిపారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత పదేళ్లలో 152కి పైగా ప్రశ్నాపత్రాలు లీక్ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుతో చలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే వారిని అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని దింపివేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, బ్లాక్, మండల మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, చెన్నగొని అంజయ్య, వెల్గ రాజశేఖర్ రెడ్డి, బొంగు జంగయ్య గౌడ్, గుండు మల్లయ్య గౌడ్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్, సుర్వి నరసింహ గౌడ్, గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, ఎండోమెంట్ గుడి చైర్మన్లు, షాదికాన చైర్మన్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఢిల్లీ లో యువతపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News