Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 01:34 AM

ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
June 02, 2026 03:48 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


రూ.50 కోట్లతో నల్గొండ - ధర్వేశిపురం రహదారి పనులు రేపటి నుంచే ప్రారంభం..

రూ.239 కోట్లతో కొండమల్లేపల్లి - దేవరకొండ - డిండి హ్యాం రోడ్డు..

రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం..

నల్గొండ : కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ (ఆదర్శ) ఆలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆలయ సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ధర్వేశిపురంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

రేపటి నుంచే రోడ్డు పనులు త్వరలో సీఎం రాక..

​ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ధర్వేశిపురం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇక్కడికి తీసుకువస్తానని ప్రకటించారు. రహదారులు బాగుంటేనే ఆ ప్రాంతానికి అన్ని రకాల సౌకర్యాలు, వసతులు సమకూరుతాయన్నారు. కేంద్ర రహదారుల నిధులు 50 కోట్ల రూపాయలతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు నిర్మించనున్న రహదారికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. రేపటి (బుధవారం) నుంచే ఈ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభిస్తున్నాం. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమను (ఇండస్ట్రీ) ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందన్నారు.

రూ.1,300 కోట్లతో 480 డబుల్ రోడ్లు..

​రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.1,300 కోట్ల అంచనా వ్యయంతో 480 రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే రూ.239 కోట్ల వ్యయంతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు - కొండమల్లేపల్లి - దేవరకొండ - డిండి వరకు హ్యాం (HAM) రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మంజూరు చేయనున్నామని, ఇవి పూర్తయితే పల్లెల రూపురేఖలు మారిపోతాయన్నారు.

రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి రెండు పంటలకు నీరు..

​నల్గొండ జిల్లా సమగ్ర వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. జిల్లాలో ఇప్పటికే ఏఎమ్మార్పీ (AMRP) కాలువల లైనింగ్ పనులను చేపట్టామన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగం పనులను పూర్తి చేసి, జిల్లా రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ధర్వేశిపురం, కనగల్ మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

రూ.900 కోట్లతో నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు..

​నల్గొండ పట్టణాభివృద్ధి కోసం రూ.900 కోట్లతో చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఉదహరించారు.

రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చెరుకు వెంకట్ రెడ్డి. 

​అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సీహెచ్ (చెరుకు) వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇదివరకే రూ.5 కోట్లతో కల్యాణమండపం, వాటర్ ట్యాంకు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన రూ.5 కోట్లతో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తామని వివరించారు. ఇదే సమయంలో ధర్వేశిపురంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని, పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా, నూతన ధర్మకర్తల మండలి సభ్యులందరూ మాతృభాష తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, కనగల్ తహసీల్దార్ పద్మ, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News