Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ధాన్యం కొనుగోలు పై సమీక్ష: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వ విప్ వేముల వీరేశం

22-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్, నకిరేకల్, కేతపల్లి మండలాల రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, రైతులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం తూకం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, చెల్లింపులను సమయానికి పూర్తి చేసి రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు పై సమీక్ష: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Article Image

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్, నకిరేకల్, కేతపల్లి మండలాల రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, రైతులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం తూకం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, చెల్లింపులను సమయానికి పూర్తి చేసి రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News