Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:26 AM

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......

11-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వం విఫలం.....

కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు శనివారం తమ్మర వద్ద కోదాడ,ఖమ్మం రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతలు కోసి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఒక పక్కన కమిషన్ ఏజెంట్లు,దళారులు, మిల్లర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రహదారిపై ధర్నా చేయడంతో ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణ, దొడ్డ వెంకటయ్య, రైతులు కమతం రాజేశ్వరరావు, వీరేపల్లి కృష్ణమూర్తి, బొమ్మ కంటి వీరబాబు, బైరాబోయిన వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.........

Sthanikam

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News