Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

16-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో అవినీతి మరొకసారి బహిర్గతమైంది. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సైదులు, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… సంబంధిత పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం సైదులు కాంట్రాక్టర్‌ను లంచం కోరినట్లు సమాచారం. పలుమార్లు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సైదులను పట్టుకుంది.

దాడి అనంతరం సైదులుని అదుపులోకి తీసుకుని, అతని నివాసం మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో దేవరకొండలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

Sthanikam

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News