Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష

07-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకోవాలని యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లికి చెందిన సురేష్ సోమందేపల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజు దుకాణం డబ్బును తన గ్రామానికి తీసుకెళ్లే అలవాటు ఉండేది.

ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు గత సంవత్సరం నవంబర్ 12 రాత్రి పాపిరెడ్డిపల్లి సమీపంలో సురేష్‌పై కారంపొడి చల్లి దాడి చేసి డబ్బు దోచుకోవాలని ప్రయత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సోమందేపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన నిందితులు నాగార్జునరెడ్డి, ప్రేమకుమార్, నందలను శనివారం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 15 రోజుల జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ, గంజాయి వినియోగం, మద్యం సేవించి గొడవలు చేయడం, మత్తు పదార్థాలు వాడి అల్లర్లు సృష్టించడం వంటి సంఘ విద్రోహ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు

Sthanikam

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News