Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల
01-04-2026 648 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెత్త, దోమలతో ఆరోగ్య సమస్యలు… స్పందించని అధికారులు.

వార్డు సభ్యుడు గంజి భాస్కర్

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని 11వ వార్డులో మురికినీటి సమస్య తీవ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివాలయం సమీపంలో గ్రామ పంచాయితీ నుంచి గంజి భాస్కర్ ఇంటి వెనుకుగా ప్రవహిస్తున్న మురికినీరు మూసీనదిని తలపించేలా ఉంది.

దాదాపు 150 ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు, స్నానాలు, పాత్రలు కడిగిన నీరు ఒకేచోట చేరి ఏరులా పారుతోంది. అందులో ప్లాస్టిక్ గ్లాసులు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో పరిసరాలు అసహనంగా మారాయి. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.

ప్రస్తుత, గత సర్పంచ్‌లు సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై తీసిన ఫోటోలను పరిశీలించి నిజానిజాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు గంజి భాస్కర్ కోరారు.

Sthanikam

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News