Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:46 AM

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.

20-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనంతారంలో యువతకు అవగాహన కల్పించిన భువనగిరి రూరల్ పోలీసులు..

భువనగిరి, జూలై 20:

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్‌ఐ అనిల్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామంలో సోమవారం నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు దెబ్బతింటాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెపాటి నాగరాణి–రాజలింగం, ఉపసర్పంచ్ వడ్డెబోయిన వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేష్, సల్ల పాండు, మచ్చ శంకర్, గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News