Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

దళిత రత్న అవార్డుతో ఆడపు లక్ష్మణ్‌కు ఘన సత్కారం

17-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దళితుల పక్షాన పోరాడుతూ, దళితులకు సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి సత్కరిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక సేవకుడు ఆడపు లక్ష్మణ్ కు “దళిత రత్న” అవార్డును ప్రదానం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దళితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ ఛైర్మన్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కో-ఛైర్మన్ సుదర్శన్ బాబు చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన ఆడపు లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు.

తనకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కో-ఛైర్మన్ సుదర్శన్ బాబు, అలాగే అవార్డు ప్రదానానికి సహకరించిన MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని ఎల్లేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. దళితుల హక్కుల సాధన కోసం, వారి అభ్యున్నతికి నేను మరింతగా కృషి చేస్తాను” అని ఆడపు లక్ష్మణ్ పేర్కొన్నారు.

Sthanikam

దళిత రత్న అవార్డుతో ఆడపు లక్ష్మణ్‌కు ఘన సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News