Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:51 PM

డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయి

05-04-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని చిలుకల మంజుల వెంకన్న, బిసి సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ కోతి రాములుఅన్నారు. ఆదివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ ఎక్స్ రోడ్లో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ 119 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ విద్య అభ్యాసం నుండి కుల వివక్షత ఎదుర్కొన్నారని, వివక్షత నుండి పోరాట ప్రతిమ మొదలు పెట్టారని, మదన మోహన మాలవ్య బెనారస్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్, బెంగాల్లో డిగ్రీ చదివారని మొదట స్వాతంత్ర ఉద్యమం బెంగాల్ నుండి ప్రారంభమైనదని, బాబు జగ్జీవన్ రామ్ బెంగాల్ లో చదువుకోవడం వలన అక్కడి ఉద్యమాలలో దళితులను, అన్నగారిన ఆట్టడుగు వర్గాల వారిని ఏకం చేసి అనేక ఉద్యమాలలో పాల్గొని వారి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, 30 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో అనేక కీలకమైన పదవులు కార్మిక, వ్యవసాయ, రైల్వే, రక్షణ శాఖలు అనుభవించి ఆ పదవులకు వన్నె తీసుకొచ్చారని

కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేశారని, ఇండోపాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టి యుద్ధాన్ని పటిష్టంగా ఎదుర్కొన్నారని, సమాజంలో అట్టడుగు బలహీన వర్గాల వ్యత్యాసం ఉండకూడదని, సమ సమాజ స్థాపన జరగాలని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని వారి యొక్క ఆశయాలను, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నెబోయిన శ్రీకాంత్ ,కేతిరెడ్డి రవీందర్ రెడ్డి,పాశం అజయ్ కుమార్,చింతకుంట్ల విఠల్ వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు అంబేద్కర్, యాదగిరి,సైదులు,యాకయ్య, ఉపేందర్ సుధాకర్,అశోక్ రెడ్డి,లింగయ్య ,మధు,నాగరాజు,రాజు అవిలయ్య గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News