Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:38 PM

డా. నోముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు

07-03-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, మానసిక ఆరోగ్య సేవలలో విశేష కృషి చేసినందుకు గాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హయత్‌నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రముఖ సైకాలజిస్టు డా. నోముల వెంకటేశ్వర్లు కు “తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు – 2026” అందజేయనున్నారు.

సికింద్రాబాద్‌లోని హరిహర కళా భవన్ లో మార్చి 8న ఉదయం నిర్వహించనున్న 38వ సేవా ఉగాది మహోత్సవం – అవార్డుల సన్మాన సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సర్ సి.వి. రామన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డును అందజేయగా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందించడం, సమాజంలో మానసిక ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభిస్తోంది. గతంలో కూడా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ నుంచి 2025 సంవత్సరానికి గాను “తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు” అందుకున్నారు.

ఈ సందర్భంగా జీడీసీ హయత్‌నగర్ ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు, మానసిక ఆరోగ్య కార్యకర్తలు మరియు పలువురు మేధావులు డా. నోముల వెంకటేశ్వర్లును అభినందించారు.

కార్యక్రమానికి విద్యావేత్తలు, సామాజిక సేవకులు, సాంస్కృతిక ప్రముఖులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Sthanikam

డా. నోముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News