Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

20-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, సోమవారం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆదోని టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పెద్దశక్తి గుడి అంబా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, టూ టౌన్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్ల వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించారు. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద సిద్ధార్థ నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, ప్రణీత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

శ్రీనివాస్ భవన్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, యువనాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శివప్ప పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. భువనేశ్వర్ అమ్మగారు అన్న క్యాంటీన్‌కు రూ.76 లక్షల విరాళం అందజేయడం విశేషమన్నారు.

కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సీఎం‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News