Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

07-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారాన్ని బలపరిచిన పథకమని అన్నారు. ఈ పథకం వల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గి పేదలకు పని భరోసా లభించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను నిర్ణయించి, కార్మికులకు పని కల్పించే విధానం ఈ పథకంలో ఉండేదని చెప్పారు. పురుషులు, మహిళలకు సమాన వేతనం, పని అడిగిన వారికి నిర్ణీత కాలంలో పని కల్పించే హక్కు ఉండేదని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఉపాధి హామీ పథకం బలహీనపడిందని విమర్శించారు. గ్రామాల్లో జరిగే పనులపై స్థానిక నిర్ణయాధికారాన్ని తగ్గించి కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం పెంచుతున్నారని ఆరోపించారు. పేదల జీవనాధారమైన ఉపాధి పథకాన్ని బలహీనపరచడం సరైంది కాదని అన్నారు.

రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలపై రాష్ట్ర నాయకులు గట్టిగా స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ పథకాలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆమె కోరారు.

Sthanikam

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News