Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:03 PM

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ప్రసాద పంపిణీ

18-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి, శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు పండి ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.ఈ ప్రత్యేక పూజా, ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ప్రసాద పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News