Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:21 PM

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

22-02-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని రైతులకు యూరియా సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. వెలిమినేడు, చిట్యాల, గుండ్రంపల్లి ప్రాంతాల్లో ఉన్న మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 900 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. అదనంగా గ్రోమోర్ సెంటర్లు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా 300 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెప్పారు.మండలానికి ఇంకా 300 మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నప్పటికీ, 500 మెట్రిక్ టన్నుల వరకు అదనంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ రైతు గ్రూపుల ద్వారా సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.రైతులు తప్పనిసరిగా “యూరియా యాప్” ద్వారా బుకింగ్ చేసుకుని సంబంధిత డీలర్ల వద్ద నుండి ఎరువును తీసుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల పూర్తి పారదర్శకత ఉండడంతో పాటు ప్రతి బస్తాకు లెక్క ఉండి యూరియా పక్కదారి పడకుండా నివారించవచ్చని తెలిపారు. యాప్ వినియోగంలో ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా PACS సిబ్బందిని సంప్రదించవచ్చన్నారు.

ప్రస్తుతం వరి పంట పొట్ట దశలోకి ప్రవేశిస్తున్నందున ఎకరానికి 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలని, అధిక మోతాదులో యూరియా వాడితే పంటకు నష్టం జరుగుతుందని రైతులకు సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా యాప్ విధానాన్ని అనుసరించి ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు.

Sthanikam

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News