Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు

04-03-2026 611 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఏపూరు గ్రామపంచాయతీ పరిధిలో మద్యం మరియు మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కీలక తీర్మానం ఆమోదించబడింది. గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్థుల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది.గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల యజమానులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి, గ్రామాభివృద్ధి మరియు యువత సంక్షేమం కోసం మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని సర్పంచ్ స్పష్టంచేశారు. గ్రామ శాంతి భద్రతలు, కుటుంబ వ్యవస్థల పరిరక్షణ, యువతలో పెరుగుతున్న వ్యసనాల నియంత్రణ వంటి అంశాలను వివరిస్తూ అవగాహన కల్పించారు.

సర్పంచ్ పిలుపుకు స్పందించిన బెల్ట్ షాప్ నిర్వాహకులందరూ రేపటి నుంచే గ్రామ పరిధిలో ఎలాంటి మద్యం లేదా మత్తు పదార్థాల విక్రయం జరపబోమని హామీ ఇచ్చారు. ఈ మేరకు సర్పంచ్ సమక్షంలో లిఖితపూర్వకంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు గ్రామపంచాయతీ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.గ్రామంలో ఇకపై ఎవరైనా గుప్తంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ హెచ్చరించింది.

Sthanikam

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News