Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

15-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ మరియు మండలంలోని పలు గ్రామాల్లో,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభల్లో మాట్లాడుతూ నాయకులు, ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఇప్పటి భారతదేశం అంబేద్కర్ ఆశయాల దిశగా ముందుకు సాగుతోందని, ప్రతి పౌరుడు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనిసూచించారు.మండల వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ , వైస్ చైర్మన్ గుండుబోయిన శ్రీ లక్ష్మీ ,సైదులు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు ఆరెగూడెం సర్పంచ్, నాగంపల్లి శ్యాంసుందర్, చిన్న కాపర్తి సర్పంచ్, ఆవుల సుందర్, బోయగుబ్బ సర్పంచ్ రేగులగడ్డ స్వామి, గుండ్రంపల్లి సర్పంచ్ , బత్తుల లక్ష్మీ ప్రసన్న నరసింహ, , వేoబాయి సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News