Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

11-04-2026 632 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇప్పటికే ధాన్యం బస్తాలు కాంటపెట్టి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, మరో కొత్త సమస్య తలెత్తింది. ఐకెపి సెంటర్ల సూచనల మేరకు లోడింగ్ కోసం వెళ్లిన లారీలు ధాన్యాన్ని ఎత్తుకుని రైస్ మిల్లులకు చేరుకున్నా, అక్కడ అన్లోడింగ్‌కుఅనుమతించకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.చిట్యాల పరిధిలోని సిద్ధార్థ, ఉదయ, హనుమాన్, పరమేశ్వరి, లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లులకు చేరుకున్న లారీలను మిల్లర్లు అన్లోడ్ చేయబోమని స్పష్టం చేయడం గమనార్హం. దీంతో లారీ డ్రైవర్లు రోడ్డుపై నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే రైతులు ధాన్యం నిల్వ సమస్యతో ఆందోళన చెందుతుండగా, మిల్లర్ల నిరాకరణతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

“మేము ఐకెపి సెంటర్ల సూచనల మేరకు ధాన్యం లోడింగ్ చేసి మిల్లులకు తీసుకువచ్చాం. కానీ ఇక్కడ అన్లోడ్ చేయమని చెబుతున్నారు. మా లారీలు నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి” అని లారీ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Sthanikam

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News