చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిన చిరుమర్తి*...
చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిన చిరుమర్తి*...
Editor Desk
అంబేడ్కర్ భావజాలం పునికిపుచ్చుకోని నిరంతరం ప్రజలతోనే చిరుమర్తి.
ఆకుంటిత దీక్ష పట్టుదలతో ముందుకు
ప్రజలకోసం నిత్యం పరితపన
అభివృద్ధి పథంలో నకరికల్ ను అగ్రగామిగా నిలిపిన ప్రజానేత
వేల కోట్ల అభివృద్ధి పనులతో ప్రజల మనసులో చెరగని ముద్ర
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజాసేవ
"స్థానికం " ప్రత్యేక కథనం. - చిరుమర్తి జన్మదినం సందర్భంగా
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడుతున్న నిరాడంబరుడు,
నిత్యం ప్రజల మద ఉంటూ వారి బాగోగుల కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తన ప్రజాప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నకిరేకల్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం " చిరుమర్తి లింగయ్య ”
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో చిరుమర్తి నర్సింహ మారమ్మ పుణ్య దంపతులకు చిరుమర్తి లింగయ్య ఏప్రిల్ 20,1973 వ సంవత్సరంలో జన్మించాడు, నిరుపేద కుటుంబంలో జన్మించిన చిరుమర్తి లింగయ్య బాల్యంలో తల్లితండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ తన విద్యాభ్యాసంను కొనసాగించాడు, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. నల్లగొండ ప్రభుత్వ జానియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు, బాల్యం నుండే పేదల కష్టసుఖాలు తెలిసిన చిరుమర్తి వారి బాగు కోసం ఏదైనా చేయాలని నిత్యం పరితపించేవాడు.
అభ్యుదయ భావాలు, అంబేడ్కర్ భావజాలం, గాంధీ సిద్దాంతాలకు ప్రేరేపితుడైన చిరుమర్తి రాజకీయ ఆరంగ్రేటం చేశాడు. మాటకోసం, విలువల కోసం కట్టుబడే లక్షణాలున్న చిరుమర్తిని స్థానిక ప్రజలు ఆక్కున చేర్చుకున్నారు. 1995 సం॥లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణవెల్లెంల ఎంపీటీసీగా గెలుపొంది క్రియశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, 2001 లో జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో నార్కట్ పల్లి జెడ్పీటిసిగా విజయం సాధించాడు. 2001 లో వెలువడిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో మొదటి విజయం చిరుమర్తిదే. దాంతో ఉమ్మడి నల్లగొండ రాజకీయ ముఖచిత్రంలో చిరుమర్తికి ప్రాధాన్యత పెరిగింది. అప్పటి జెడ్పీ చైర్మెన్ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులకు ధీటుగా తన రాజకీయ చతురతను చాటాడు. 2009 వ సం॥లో డి-లిమిటేషన్ లో బాగంగా నకిరేకల్ అసెంబ్లీ స్థానం ఎస్సికి రిజర్వుడ్ అయినది. చిరుమర్తి కృషికి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలో వారి కోటలను బద్దలు కొట్టి చిరుమర్తి భారీ మెజార్టీతో గెలువడం ఉమ్మడి రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించింది.
తనను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాడు. స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా ఆంద్రా ప్రాంతానికి చెందిన సీఎం మంత్రుల వద్ద ఎక్కడా రాజీపడకుండా పెద్ద మొత్తంలో నిధులను సాధించాడు. గ్రామ గ్రామాన సీసీ రోడ్ల నిర్మాణనికి, చెరువుల మరమత్తులకు, గ్రామపంచాయతీ భవనాలు, ప్రభుత్వ, భవనాలు నిర్మాణం , గ్రామీణ రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు, ప్రతీ గ్రామానికి కృష్ణ నీరు సరఫరా కోసం కృషి చేశాడు. ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పూర్తికోసం ఉడుం పట్టుపట్టాడు. NH - 65 రోడ్లు విస్తరణ ప్రారంభ పనులు చిరుమర్తి అధ్యక్షతన జరిగిన సభ ద్వారా ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచేందుకుగాను ఎమ్మెల్యే పదవికి మొట్టమొదటగా రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత మిగిలిన ఎమ్మెల్యేలు చిరుమర్తిని అనుసరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి ఘన విజయం ఖాయమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇది గిట్టని కొందరు నేతలు కుట్రలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ , కేసీఆర్ హవాను తట్టుకొని ఎన్నికల్లో విజయం అంచుదాక వచ్చి కేవలం 2 వేల ఓట్ల తేడాతో అపజయం పాలయ్యాడు.
కానీ ఆ ఓటమి ప్రజలకు మరింత దగ్గరికి చేర్చింది. ఓటమితో కుంగిపోకుండా, అనేక సవాళ్లను, దాడులను, బెదిరింపులను తట్టుకొని ప్రజల పక్షాన నిలిచాడు. ప్రజల మద్దతు, అనుచరుల కృషితో 2018 ఎన్నికల్లో రెండవ సారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికోసం కేసీఆర్ అడుగుజాడల్లో నడవడానికి అప్పటి మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల ఆశిస్సులతో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. అందుకు అనుగుణంగానే నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు సాదిస్తూ అభివృద్దిలో నకిరేకల్ ను అగ్రగామిగా నిలిపాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల అండదండలతో నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన అయిటిపాముల లిఫ్ట్ ను సాధించాడు. అంకుటిత దీక్షతో లిఫ్ట్ ఏర్పాటుకు 100 కోట్లను మంజూరు చేయించారు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తికి విడతల వారిగా నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాడు. నకిరేకల్, రామన్నపేట ఆసుపత్రుల స్థాయి పెంపునకు నిర్విరామమైన కృషి చేసి నకిరేకల్ లో 32 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి విజయం దక్కించుకున్నారు, నకిరేకల్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటులో విజయం సాధించారు. నూతనంగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కంకణం కట్టుకొని 27 కోట్లను మంజూరు చేయించి సెంట్రల్ లైటింగ్,డివైడర్స్ & మినీ ట్యాంక్ బండ్ మరియు వైకుంటదామల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు, పట్టణంలో ప్రతి వీధికి సిసి రోడ్డు, డ్రైనేజీలను నిర్మించాలని నిశ్యయించుకొని 15 కోట్లను మంజూరు చేయించారు, వినియోగదారులకు అన్నిరకాల కురాయగలు, పూలు, పండ్లు, మాంసం ఇతర వస్తువులు ఒకేచోట లభించేలా చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలలో 2 కోట్ల చొప్పున 4 కోట్లను మంజూరు చేయించారు, ఎన్నోఏండ్లుగా శిథిలావస్థలో ఉన్న నకిరేకల్ బస్ స్టాండ్ ను 50 లక్షలతో ఆధునీకరించారు, ఆహ్లాదకరంగా, నూతన పద్దతుల్లో 1 కోటి రూపాయలతో నకిరేకల్ పట్టణంలో వైకుంటదామంను నిర్మించారు, 50 కోట్లతో ప్రతి గ్రామాన సిసి రోడ్లు, డ్రైనేజిలను నిర్మాణాన్ని చేపట్టారు.
ఆసిఫ్ నహర్ గేట్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాడు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలు, ఆవాస గ్రామాల్లో అభివృద్ధి పనులకు కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. ప్రతి ఇంటికి మంచి నీరు, ప్రతివాడకు సీసీరోడ్డు, ప్రతీ పల్లెకు రోడ్డు అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఆపద సమయంలో ప్రయివేటు ఆసుపత్రులలో మెరుగైన వైద్యం చేయించుకున్న పేదవారికి సీఎం సహాయనిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు చేయించడం ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, రాష్ట్రలోని అగ్రస్థానంలో నిలిచాడు..
నేడు చిరుమర్తి లింగయ్య జన్మదిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల మధ్యే ఉండి సేవ చేయాలనే ఆయన సంకల్పం మరింత బలపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి