Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:25 AM

చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్‌లో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

28-02-2026 744 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేటలోని సిద్ధార్థ హై స్కూల్లో కబ్ కోడర్స్ ఆధ్వర్యంలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ పలగాని శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం అత్యంత అవసరమని, కంప్యూటర్ విద్య ద్వారా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ విద్యార్థులలో కోడింగ్, ప్రోగ్రామింగ్ మరియు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన సీవో తిరుపతి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ కల్పన ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ముసునూరు జెడ్పీటీసీ మరియు ఆచార్య ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ వరికూటి ప్రతాప్, గన్నవరం నవోదయ కోచింగ్ సెంటర్ విశ్వభారతి ఎస్.డి.లాల్, తూర్పు దిగవల్లి సర్పంచ్ మరియు వైష్ణవి విద్యా సంస్థల చైర్మన్ నాని, వీరపనేనిగూడెం గణేష్ యూపీ స్కూల్ కరస్పాండెంట్ ఆనంద్ సాగర్ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభాన్ని స్వాగతించారు.

కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, విద్యార్థుల భవిష్యత్‌కు కొత్త దిశగా నిలిచింది.

Sthanikam

చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్‌లో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News