Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

04-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన వేడుక

నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రాసన వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన బోయిన గోపి–మాధవి దంపతుల కుమార్తె పవన్ శ్రీ అన్నప్రాసన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్, ఆహార నాణ్యతపై సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా పోషకాహారం అందించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమ్ కుమార్, అంగన్వాడి టీచర్లు సూరేపల్లి సుజాత, ఎన్నబోయిన విజయ, శ్రీలత సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా హాజరై వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News