Sthanikam - Truth Matters
Logo

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Updated : 20 Jan 2026 17:31 IST
As Preferred Source 1 min read
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా 20-01-2026న నల్లగొండ జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, చండూర్ సీఐ ఆది రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై పి. విష్ణుమూర్తి పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చెరువుగట్టు దేవస్థానం ఈవో, ఏఈ, ఆలయ సిబ్బంది మరియు జాతరకు సంబంధించిన కాంట్రాక్టర్ పాల్గొన్నారు.

Sthanikam

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news