Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

20-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ గుడి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ముగుదాల పావని రమేష్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.

డిప్యూటీ డాక్టర్ యశోద మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారికి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు.

ఈ శిబిరంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ వినయ్, శ్రీనివాసరావు (ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), మోహన్ రెడ్డి (ఏడీఓ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్), డాక్టర్ సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి), కాటమరాజు (మెడికల్ ఆఫీసర్, తంగేడుపల్లి) తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది సేవలందించారు.

శిబిరంలో మొత్తం 205 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 65 మంది, ఆర్థోపెడిక్ సమస్యలకు 77 మంది, కంటి సంబంధిత సమస్యలకు 63 మంది చికిత్స పొందారు. అవసరమైన ఆరుగురిని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశారు.

Sthanikam

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News