Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.

 చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.
17-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సర్పంచ్ బీసు ధనలక్ష్మి ప్రారంభించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత వృత్తిలో ఎక్కువసేపు ఒకే భంగిమలో పనిచేయడం వల్ల కార్మికుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉన్నత స్థాయి చికిత్స కోసం రిఫరల్ సౌకర్యం కల్పించారు.

మొత్తం 192 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సేవలు పొందగా, అందులో 80 మంది పురుషులు, 112 మంది మహిళలు ఉన్నారు. సాధారణ వైద్యం, ఆర్థోపెడిక్, కంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఏడీఓ (హ్యాండ్లూమ్స్) సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News