రామన్నపేట ,
చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లంకి చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ను కోరారు.సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, ఉపాధ్యక్షుడు కొంగరి జానయ్య, కార్యదర్శి రుద్ర వెంకటేష్తో పాటు సభ్యులు గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావీటి రమేష్ తదితరులు చేనేత కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి