Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:45 AM

చౌటుప్పల్‌లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం

చౌటుప్పల్‌లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం

చౌటుప్పల్‌లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం
21-07-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నిగూఢంగా అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...​నల్గొండ జిల్లా ఆత్మకూరు (ఎస్) గ్రామం, మండలానికి చెందిన గుణగాటి మల్సూర్ (45, గౌడ్) ప్రస్తుతం చౌటుప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కూకట్‌పల్లిలోని ఎంఎస్ఎన్ (MSN) కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10:20 గంటల సమయంలో "హైదరాబాద్‌కు వెళ్తున్నాను" అని ఇంట్లో చెప్పి మల్సూర్ బయటకు వెళ్లారు. రాత్రి అయినా ఆయన తిరిగి ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. భర్త ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనతో ఆయన భార్య రాధిక ఆదివారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News