Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:23 AM

చౌటుప్పల్‌లో 'మట్టి' సెగ.. ఎలివేటెడ్ కారిడార్‌కే పట్టు!

చౌటుప్పల్‌లో 'మట్టి' సెగ.. ఎలివేటెడ్ కారిడార్‌కే పట్టు!

చౌటుప్పల్‌లో 'మట్టి' సెగ.. ఎలివేటెడ్ కారిడార్‌కే పట్టు!
April 19, 2026 05:20 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జాతీయ రహదారిపై అండర్‌పాస్ పనుల అడ్డగింత..

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల నేతృత్వంలో భారీ ధర్నా

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జి పనులకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. మట్టితో కూడిన గోడల నిర్మాణం వల్ల పట్టణం రెండు ముక్కలవుతుందని, తక్షణమే పిల్లర్ల ఆధారిత 'ఎలివేటెడ్ కారిడార్' నిర్మించాలని డిమాండ్ చేస్తూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, వ్యాపారులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు

పట్టణం రెండు ముక్కలు.. వ్యాపారాలు మట్టిపాలు!

ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల చౌటుప్పల్ ప్రజలు బలికావాల్సి వస్తోందని మండిపడ్డారు.మట్టి గోడలతో బ్రిడ్జి నిర్మిస్తే పట్టణం మధ్యలో పెద్ద అడ్డుగోడలా తయారై, రాకపోకలు స్తంభించిపోతాయి.బస్టాండ్ పరిసరాల్లోని వేలాది దుకాణాలకు కస్టమర్లు వచ్చే దారి లేక, చిన్న వ్యాపారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్లు చెరువుల్లా మారుతాయని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.​"పిల్లర్ల పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే చౌటుప్పల్ సమస్యకు శాశ్వత పరిష్కారం. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి."​ఇప్పటికే ఎన్‌హెచ్ఏఐ (NHAI) అధికారులకు వినతిపత్రం అందజేశామని, అవసరమైతే అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించి ప్రజల ఇబ్బందులు చూపిస్తామని నేతలు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, చౌటుప్పల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్, కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, ఉదరి యాదయ్య, రాజరత్నం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుర్వి మల్లేష్ గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ ఉడుగు మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కయ్యుమ్ పాషా, బండారు నర్సింహ,జిల్లా నాయకులు ఢిల్లీ మాధవ రెడ్డి, దయాకరీ చారి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, అత్తర్ పాషా, చేవగొని మహేష్ గౌడ్, తోర్పునూరి మల్లేష్ గౌడ్, యువ నాయకులు మున్నా, ముషీర్, స్వామి, మునుకుంట్ల సత్యనారాయణ, ఢిల్లీ శంకర్ రెడ్డి, ఊదరి రాకేష్, యువజన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు కిరాణం అసోసియేషన్ వ్యాపారస్తులు, క్లాత్ అసోసియేషన్ వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News