Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

14-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి V. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక్ అదాలత్ నిర్వహణపై కోర్టు పరిధిలోని మారుమూల గ్రామాల వరకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 28 వరకు ప్రతిరోజూ కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశముంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ , చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ , నారాయణపూర్ సీఐ రాములు , ఎక్సైజ్ సీఐ బాళోజి నాయక్ , ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News