Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!
18-04-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు తరలింపు పట్టించుకోని అధికార యంత్రాంగం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండానే నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఈ విషయమై స్థానిక సామాజిక కార్యకర్త బోయ లింగస్వామి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.​

విచ్చలవిడిగా తవ్వకాలు.

వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నల్లమట్టిని టిప్పర్ల ద్వారా చౌటుప్పల్ హైవే మీదుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తరలిస్తున్నారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నట్లు సమాచారం. అయితే, రాత్రి వేళల్లో తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.​నిమ్మకు నీరెత్తినట్లు అధికారులుఈ అక్రమ రవాణాపై స్థానిక రెవెన్యూ (ఎమ్మార్వో), పోలీస్ (సీఐ ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కళ్లముందే టిప్పర్లు తిరుగుతున్నా కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని, వారి పరోక్ష సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు.​చౌటుప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై స్పందించి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News