Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

చాట్రాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులకు ఘన సన్మానం

08-03-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ మరియు మాసగిరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలల మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సత్కరించారు. మండలంలో ఇంతవరకు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించకపోయినప్పటికీ ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాసగిరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు మండల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయినుల కోసం వివిధ రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చనుబండ పిఏసీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, హాజరై మహిళా ఔన్నత్యాన్ని చాటారు సందర్భంగా మాట్లాడుతూ మహిళ లేనిదే సృష్టి లేదని మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరారు. సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

ఎంఈఓ–2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి మాట్లాడుతూ మహిళలకు 50 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు లేకుంటే సమాజానికి మనుగడ లేదని తెలిపారు. బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయని, వరకట్న వేధింపులకు బలైన యువతి బాధను ప్రతిబింబించే గీతాన్ని స్వయంగా పాడి వినిపించారు. మహిళలకు సేవ చేయడంలో తల్లి స్ఫూర్తిగా ముందుంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, లక్ష్మీ, సౌభాగ్యం తదితరులు మరియు మండలంలోని మహిళా ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News