Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:34 AM

చాట్రాయిలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

07-03-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి శీర్ణం సుమన్ రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. శనివారం ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, రెండు పెన్నులు, పెన్సిల్, స్కేల్, ఎరేసర్, షార్ప్నర్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సుమన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. పేద కుటుంబానికి చెందినప్పటికీ క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి ముందుకు వచ్చానన్నారు. ప్రైవేట్ టీచర్‌గా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని టీసీఎల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. కష్టపడి చదివితే పేదరికం ఉన్నత స్థాయికి చేరడంలో అడ్డంకి కాదని, ప్రస్తుతం తాను సంవత్సరానికి కోటి రూపాయల వేతనం సంపాదిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరి సౌకర్యవంతమైన జీవితం గడపవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోలి సత్యనారాయణ రెడ్డి, నీల ధనలక్ష్మి, రామారావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News