Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్

05-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో రబీ కాలానికి వరి సాగు సుమారు 2,780 ఎకరాల్లో జరుగుతున్నదని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలిపారు. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసే దశలో ఉన్నందున రైతులు సమగ్ర పోషక మరియు యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు.

పంటలో నీటి ఎద్దడి లేకుండా సుమారు 5 సెంటీమీటర్ల నీటి మట్టాన్ని తప్పనిసరిగా నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. వరి వేరు వ్యవస్థ పైభాగంలోనే ఉండటం వల్ల 5 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండడం పంట ఎదుగుదలకు ఎంతో అవసరమని వివరించారు.

వరిలో కాండం తోలుచు పురుగు లక్షణాలను రైతులు గమనించాలని సూచించారు. పసుపు గోధుమ వర్ణంలో ఉండే రెక్కల పురుగులు ఉదయం సమయంలో ఆకుల కొనలపై కనిపిస్తాయని, గుడ్ల సముదాయం కూడా ఆకులపై కనిపిస్తుందని తెలిపారు. ఈ పురుగులు కాండంలోకి ప్రవేశించి లోపలి గుజ్జును తినడం వల్ల మొవ్వు ఎండిపోతుందని చెప్పారు. ఎండిన మొవ్వలను పీకినప్పుడు అవి సులభంగా ఊడి వస్తాయని, పూత దశలో ఈ పురుగు ప్రభావం ఉంటే కంకి తెల్లబడిపోతుందని వివరించారు.దీనిని నివారించడానికి పిలక దశలో కార్బో ఫ్యూరాన్ 3 జి 10 కిలోలు లేదా 4 జి గుళికలు 8 కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ చల్లాలని సూచించారు. అంకురం ఏర్పడే దశలో క్లోరోన్ ట్రిలిని ప్రోల్ 20 ఎస్ సి మందును ఒక ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యూ పి మందును 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా పోలవరం గ్రామంలో వరి క్షేత్రాలను అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News