Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం

06-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు (41) ఫిబ్రవరి 23న మృతి చెందిన విషయం తెలిసిందే. జయరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించారు.

ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో వారు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని కొమ్ము ఆనందం కోరారు.

Sthanikam

చాట్రాయి లో మృత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: కొమ్ము ఆనందం

Article Image

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు (41) ఫిబ్రవరి 23న మృతి చెందిన విషయం తెలిసిందే. జయరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించారు.

ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో వారు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు బుర్రి జయరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని కొమ్ము ఆనందం కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News