Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 04:19 AM

చదువుల తల్లికి కోమటిరెడ్డి'సుశీలమ్మ ఫౌండేషన్' చేయూత..

21-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

151 మంది విద్యార్థులకు రూ. 24.50 లక్షల ప్రోత్సాహకాలు..

బడిని గుడిలా భావిస్తా...ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఫౌండేషన్ లక్ష్యం కోమటిరెడ్డి లక్ష్మి..

మునుగోడు : ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు అండగా నిలిచారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 151 మంది విద్యార్థులకు మంగళవారం భారీ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఫౌండేషన్ చైర్‌పర్సన్ లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి పారితోషకాల పంపిణీని ప్రారంభించారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ. 25,000, రూ. 15,000, రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 24,50,000 నగదును చెక్కుల రూపంలో జ్ఞాపికలతో కలిపి అందజేశారు. గతేడాది 62 ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు సాయం అందించిన ఫౌండేషన్, ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు కూడా చేయూతనిచ్చి వారిలో పోటీ తత్వాన్ని పెంచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యను, బడిని తాను గుడితో సమానంగా భావిస్తానని పేర్కొన్నారు. "మన కోసం మనం బ్రతకడం కాదు.. పదిమందికి సాయం చేస్తూ బ్రతకడమే గొప్పతనం" అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అండగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. యువత సెల్ ఫోన్లకు, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమాజం కోసం తనకంటే ఎక్కువగా తన శ్రీమతి లక్ష్మి పరితపిస్తుందని కరోనా కాలంలోనూ ఆమె ఎంతో సేవ చేసిందని ఈ సందర్భంగా కొనియాడారు.

​నిరంతరం అండగా ఉంటాం..

ఫౌండేషన్ చైర్‌పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ.. మునుగోడు విద్యార్థుల మాటలు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలోనైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దేవుడు ఇచ్చిన దానిలో తోచినంత ఇతరులకు సాయం చేయడమే తమ ఫౌండేషన్ ఆశయమని తెలిపారు. తమ నుంచి సాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి తిరిగి సాయం చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

చదువుల తల్లికి కోమటిరెడ్డి'సుశీలమ్మ ఫౌండేషన్' చేయూత..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News