Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు

06-03-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలో కోతుల గురించి పట్టించుకోని అధికారులు

ఎకరానికి రూ.40 వేల నష్టం – రైతును కరిచిన కోతి

చాట్రాయి మండలంలో కోతుల బెడద తట్టుకోలేక ఓ రైతు చేతికి అంది వచ్చిన మొక్కజొన్న పంటను దున్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలపాలైంది.

మండలంలోని బూరుగుగూడెం గ్రామానికి చెందిన రైతు అనిపెద్ది సత్యనారాయణ మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే గత రెండు నెలలుగా సుమారు 200 కోతుల గుంపు తరచూ పంటపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించిందని ఆయన తెలిపారు. ఎకరానికి సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టినా పంటను కాపాడుకోలేక చివరకు దున్నించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోతులను తరిమివేయడానికి ఆరుగురు కూలీలతో ప్రయత్నించగా ఒక కోతి తనను కరిచి గాయపరిచిందని సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటన తర్వాత కూలీలు కూడా కోతులను తరిమేందుకు రావడం మానేశారని చెప్పారు. గత్యంతరం లేక చివరకు పంటను దున్నించుకున్నట్లు తెలిపారు.

గ్రామస్తులు మాట్లాడుతూ బూరుగుగూడెం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా పెరిగిందన్నారు. కోతులు ఇళ్లల్లోకి కూడా చొరబడి వస్తువులు, కూరగాయమొక్కలు నాశనం చేస్తున్నాయని మహిళలు వాపోయారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కోతుల బెడద తీవ్రతరం అయిందన్నారు.

పంటలను కాపాడుకునేందుకు టపాసులు పేల్చడం, మైక్ శబ్దాలు చేయడం, కొండముచ్చులు వదలడం, కర్రలతో తరమడం వంటి పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు.

పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని, కోతులను అటవీ ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Sthanikam

బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News