Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:45 AM

బుల్లెట్ ట్రైన్ రూట్‌లో సూర్యాపేటకు బ్రేక్.

20-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మార్గం మార్పుపై అఖిలపక్ష నేతల ఆగ్రహం.. కలెక్టర్‌కు వినతి.

సూర్యాపేట, జూలై 20:

శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గంలో సూర్యాపేటను తొలుత చేర్చి, అనంతరం విడుదలైన తాజా రూట్ మ్యాప్‌లో జిల్లా పేరును తొలగించడంపై అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కొనసాగించేలా రూట్ మ్యాప్‌ను సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, జాతీయ స్థాయి రవాణా ప్రాజెక్టుల్లో సూర్యాపేటకు ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కీలక కేంద్రంగా ఉన్న సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ మార్గం నుంచి తప్పించడం జిల్లా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు.

బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్తే పారిశ్రామిక రంగానికి ఊతం లభించడంతో పాటు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని, రూట్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

సూర్యాపేటను తిరిగి బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్‌లో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. అవసరమైతే ప్రజా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా హక్కును సాధించుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై ప్రజాప్రతినిధులు, వ్యాపార వర్గాలు, యువజన సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నట్లు నేతలు తెలిపారు. సూర్యాపేటకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

Sthanikam

బుల్లెట్ ట్రైన్ రూట్‌లో సూర్యాపేటకు బ్రేక్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News