Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్

12-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగం బట్టబయలు

యాదాద్రి భువనగిరి,: హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు బయటపడ్డాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం భువనగిరి, రామన్నపేట ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 49 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.

భువనగిరి పట్టణంలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వినియోగిస్తున్న 25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.

ఇక రామన్నపేటలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్ బాలామణితో పాటు హైదరాబాద్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పలు వ్యాపార కేంద్రాల్లో 24 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.

ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 సిలిండర్లను అధికారులు స్వాధీనపర్చుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపార కేంద్రాల్లో కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తనిఖీలలో పౌరసరఫరాల శాఖ సిబ్బంది మరియు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి–రామన్నపేటలో పౌరసరఫరాల శాఖ దాడులు… 49 సిలిండర్లు సీజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News