Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన పెంచాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

13-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: భూగర్భ జలాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తగినంత నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో Central Ground Water Board ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణపై ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం నీటి ఎద్దడిని నివారించాలంటే భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది కేంద్రీయ భూగర్భ జల శాఖ అధ్యయనాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని అన్నారు.

సీజీడబ్ల్యుబీ రీజినల్ డైరెక్టర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో వివరించారు. అనంతరం భూగర్భ జల మండలి ముద్రించిన NAQUIM రిపోర్ట్ మరియు జిల్లా రీఛార్జ్ మ్యాప్‌ను విడుదల చేశారు.

జిల్లా భూగర్భ జల అధికారి జ్యోతి కుమార్ మాట్లాడుతూ భువనగిరి జిల్లాలో నీటి ఎద్దడిని నివారించాలంటే భూగర్భ జల వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీజీడబ్ల్యుబీ శాస్త్రవేత్త యాదయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ కుమార్, మాధవి, సరిత, రేష్మ పిల్లాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన పెంచాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News