Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

భయపడకుండా పదో తరగతి పరీక్షలు రాయాలి: డీఎస్పీ శివరాం రెడ్డి

12-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

నల్గొండ,: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రాయాలని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.

భారత విద్యార్థి ఫెడరేషన్ స్టూడెంట్స్ఫె డరేషన్ అఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో భవనంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

గత పదేళ్లుగా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈనెల 14న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను భయపడకుండా ధైర్యంగా రాయాలని పిలుపునిచ్చారు. చదువే భవిష్యత్తుకు బలమైన పునాది అని, పోటీ ప్రపంచంలో నిలవాలంటే విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

పరీక్షల సమయంలో సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి పూర్తి ఏకాగ్రతతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత సేవల్లో స్థానం సంపాదించాలంటే చదువు కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.లక్ష్మిరెడ్డి, ఎంవీఆర్ పాఠశాల అధినేత రవికుమార్, వ్యాల్యూస్ కళాశాల అధ్యాపకుడు శృజన్, టీఎన్‌జీఓ నాయకులు డి.ఐ.రాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భయపడకుండా పదో తరగతి పరీక్షలు రాయాలి: డీఎస్పీ శివరాం రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News