Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 10:31 AM

భవనం ప్రారంభం ఘనంగా.. సిబ్బంది నియామకం శూన్యం..! మన్యంచెల్క పీహెచ్‌సీ దుస్థితి

భవనం ప్రారంభం ఘనంగా.. సిబ్బంది నియామకం శూన్యం..! మన్యంచెల్క పీహెచ్‌సీ దుస్థితి

భవనం ప్రారంభం ఘనంగా.. సిబ్బంది నియామకం శూన్యం..! మన్యంచెల్క పీహెచ్‌సీ దుస్థితి
July 20, 2026 08:28 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మన్యంచెల్క పీహెచ్‌సీలో వైద్య సేవలు అస్తవ్యస్తం..!

డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో రోగులకు తీవ్ర ఇబ్బందులు – సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన హెచ్చరిక

నల్లగొండ పట్టణంలోని మన్యంచెల్క ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నాడు సంఘం ప్రతినిధులు మన్యంచెల్క పీహెచ్‌సీని సందర్శించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కత్తుల లింగస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలు, వైద్య సిబ్బందితో మాట్లాడినట్లు తెలిపారు.

ఆరోగ్య కేంద్రంలో అత్యంత కీలకమైన డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులకు సమయానికి వైద్య సేవలు అందడం లేదని వారు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందని, దాని ప్రభావం వైద్య సేవల నాణ్యతపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో ఇన్వర్టర్ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారిందని వారు తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రతిసారి వ్యాక్సిన్ల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పాటు రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అత్యవసరంగా నాణ్యమైన ఇన్వర్టర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఫ్రిజ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, ఇతర రోగులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు గత రెండేళ్లుగా విడుదల కాలేదని సంఘం నాయకులు ఆరోపించారు. దీంతో చిన్నచిన్న మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, అవసరమైన పరికరాల కొనుగోలు వంటి పనులు కూడా సక్రమంగా జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని కోరారు.

గ్రామీణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు వైద్య సిబ్బందికి అవసరమైన వనరులు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత కొనసాగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కత్తుల లింగస్వామి, దండంపల్లి సరోజ స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సర్వే కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మన్నెం భిక్షం, నాయకులు మధు, అంజయ్య, రాజ్‌కుమార్, నాగమణి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. వారు ఆసుపత్రిలోని పరిస్థితులను పరిశీలించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News