- సమగ్ర మహిళ ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
చాప్టర్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కుందా ప్రతిభ
భువనగిరి స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కుందా ప్రతిభ ఆధ్వర్యంలో భువనగిరి బాలుర కళాశాల భవనం నందు మహిళల ఆరోగ్య సంరక్షణ కొరకు ఉచిత సమగ్ర మహిళ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్యాధికారి (డిఎం హెచ్ఓ) డాక్టర్ ఎం.మనోహర్ హాజరై ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో కంటి పరీక్షలు,ఆర్థోపెడిక్ పరీక్షలు,గైనకాలజీ పరీక్షలు,క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు,రుతుశ్రవ పరిశుభ్రతపై అవగాహన కల్పించి అవసరమైన మందులు శానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కుందా ప్రతిభ మాట్లాడుతూ...మహిళల సాధికారత మంచి ఆరోగ్యంతోనే సాధ్యమవుతుందని నమ్మకంతో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అంతేకాకుండా మా సంస్థ ద్వారా ఆరోగ్యము వెల్నెస్,నైపుణ్య అభివృద్ధి,విద్య,నాయకత్వము,సామాజిక చైతన్యాన్ని కలిగించడం ద్వారా మహిళలు నమ్మకంతో,ఆర్థికంగా,స్వాతంత్రంగా,ఆరోగ్యంతో ఆనందమైన జీవితాలు గడపడానికి కావలసిన అవకాశాలను సృష్టించి మహిళాలకు చేయూతనివ్వడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిలో భాగంగానే ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అని అన్నారు. నిర్వహించిన ఈ శిబిరానికి డాక్టర్ నవీన,నట్చ రాజు,(Ophthalmology),ఇన్చార్జి వీరితోపాటు డాక్టర్ నిఖిల్ ఉన్నవ (ఆర్థోపెడిక్),డాక్టర్ ఆశాలత (గైనకాలజిస్ట్),డాక్టర్ నిరోషా (మెడికల్ ఆఫీసర్),క్లియర్ విజన్ హాస్పిటల్,లార్వాన్ ఫార్మా హాస్పిటల్,భువనగిరి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్,మహిళా ఆరోగ్య వికాస్ ఫౌండేషన్ వారితో కలిసి ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ బృంద సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నిర్వాహకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి