Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం

భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం

భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం
29-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో సత్య సాయి దివ్య రథోత్సవం

ప్రేమ–సేవ సందేశంతో కన్నుల పండుగ

భువనగిరి: స్థానికం ప్రతినిధి

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి నుంచి బయలుదేరిన శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. సత్యసాయి జిల్లా సేవా సభ్యులు రథానికి ఘన స్వాగతం పలికారు.

భువనగిరి పట్టణంలోని సాయిబాబా మందిరం నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై విద్యుత్ కాంతులతో అలంకరించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. పట్టణ ప్రజలు, సత్యసాయి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రథయాత్రను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత, సోదర భావం సందేశాలు మరోసారి ప్రతిధ్వనించాయి. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సాయి సేవా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సోమ రాధాకృష్ణమూర్తి, సోమ సీతారాములు, బాలరాజు, సత్య సాయి సేవా సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో సత్య సాయి బాబా దివ్య రథోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News