Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్

04-03-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ దాన్ని తక్షణమే రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను విజయవాడలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర సమన్వయ బాధ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు వై. కేశవరావు, కే.వి.వి. ప్రసాద్, డి. హరినాథ్, కొల్లా రాజమోహన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు, పటాపంచుల జమలయ్య తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడే దిశగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

మార్చి 9వ తేదీ వరకు గ్రామ గ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, అదే రోజు రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే, భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి 23న నిరసన సభలు నిర్వహించి, ఏప్రిల్ 5న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Sthanikam

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి: రైతు సంఘాల డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News