Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:47 AM

భక్తుల సౌకర్యాలే ధ్యేయం..! ముత్యాలమ్మ ఆలయం అభివృద్ధికి సర్పంచ్ విక్రమ్ ప్రత్యేక చొరవ దాతల సహకారంతో స్నానపు గదుల నిర్మాణానికి శ్రీకారం.

20-07-2026 261 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, :

గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ప్రారంభమయ్యాయి.

దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించాలన్న సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన భువనగిరికి చెందిన దాతలు కవిత–శ్రీనివాస్ తమ తండ్రి బుగ్గయ్య జ్ఞాపకార్థం స్నానపు గదుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారు. సోమవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ కట్టుబడి ఉందని, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, చేనేత సహకార సంఘం చైర్మన్ రవ్వ నర్సింహాతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

భక్తుల సౌకర్యాలే ధ్యేయం..! ముత్యాలమ్మ ఆలయం అభివృద్ధికి సర్పంచ్ విక్రమ్ ప్రత్యేక చొరవ దాతల సహకారంతో స్నానపు గదుల నిర్మాణానికి శ్రీకారం.

Article Image

ఇంద్రపాలనగరం, :

గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ప్రారంభమయ్యాయి.

దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించాలన్న సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన భువనగిరికి చెందిన దాతలు కవిత–శ్రీనివాస్ తమ తండ్రి బుగ్గయ్య జ్ఞాపకార్థం స్నానపు గదుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారు. సోమవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ కట్టుబడి ఉందని, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, చేనేత సహకార సంఘం చైర్మన్ రవ్వ నర్సింహాతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News