Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

20-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి : రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ దిమ్మెలను కూల్చాలని వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగేలా పార్టీ కార్యాలయాలను కూల్చాలని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పుడైనా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే నేటి ప్రభుత్వం ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఏ గ్రామంలో అయినా పార్టీ దిమ్మెను ముట్టుకుంటే ప్రజల తిరుగుబాటుకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య, గోపగాని రమేష్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి : రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ దిమ్మెలను కూల్చాలని వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగేలా పార్టీ కార్యాలయాలను కూల్చాలని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పుడైనా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే నేటి ప్రభుత్వం ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఏ గ్రామంలో అయినా పార్టీ దిమ్మెను ముట్టుకుంటే ప్రజల తిరుగుబాటుకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య, గోపగాని రమేష్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News