Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:21 AM

బతికున్నవారిని మృతులుగా చూపించి రూ.1.52 కోట్లు మోసం

04-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

భద్రాద్రి కొత్తగూడెం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఇద్దరు ఏజెంట్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వెలుగుచూసింది. బతికున్న 39 మందిని మృతులుగా చూపిస్తూ డెత్ క్లెయిమ్‌ల ద్వారా సుమారు రూ.1.52 కోట్లు అక్రమంగా పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం, వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసీ ఏజెంట్లు మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీలు తీసుకున్నారు. వారి బంధువులను నామినీలుగా నమోదు చేసి, ప్రీమియంలను స్వయంగా చెల్లిస్తూ పాలసీలను కొనసాగించారు. కొంతకాలం అనంతరం పాలసీదారులు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి డెత్ క్లెయిమ్‌లు సమర్పించినట్లు తెలిసింది.

ఒకే ప్రాంతానికి చెందిన డెత్ క్లెయిమ్‌లు అధిక సంఖ్యలో రావడంతో ఎల్ఐసీ అధికారులకు అనుమానం కలిగింది. కమిటీతో విచారణ చేపట్టగా, డెత్ క్లెయిమ్ పొందిన వారంతా సజీవంగానే ఉన్నారని తేలింది.

భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించిన పాలసీలపై సాధారణంగా ప్రత్యేక విచారణ లేకుండానే డెత్ క్లెయిమ్ చెల్లించే విధానాన్ని నిందితులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం.

బీమా వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Sthanikam

బతికున్నవారిని మృతులుగా చూపించి రూ.1.52 కోట్లు మోసం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News