Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:52 PM

బత్తాయి సాగుపై జిల్లా రైతులు దృష్టి సారించాలి..

18-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ధాన్యం సేకరణలో రైతుల ను ఇబ్బంది పెడితే సహించం..

నిబంధనల ప్రకారమే కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలి..

అధికారులు , మిల్లర్ల తో సమీక్షా సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి..

నల్గొండ : రబీ ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటోందని, ధాన్యం కొనుగోలు విషయంలోనూ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించి రైతులకు అండగా నిలవాలని కోరారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే సేకరణ జరగాలని రైతుకు కేవలం కొనుగోలు కేంద్రంతోనే సంబంధం ఉంటుందని, మిల్లర్ల జోక్యం ఉండకూడదని తేల్చి చెప్పారు. తాలు, తరుగు వంటి సమస్యలు ఉంటే అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప రైతులను వేధించవద్దని మిల్లర్లకు సూచించారు. ప్రస్తుతం హరిత విప్లవం తర్వాత ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని దీనివల్ల ఏటా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా సంప్రదాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో ఉన్న బత్తాయి సాగు ఇప్పుడు 40 వేల ఎకరాలకు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తిరిగి ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. రైతులు సంఘటితంగా ఉండేందుకు రైతు ఉత్పాదక సంస్థలను (FPO) ఏర్పాటు చేసుకోవాలని కష్టాల్లో ఉన్న రైతును ఒంటరిని చేయకుండా ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మిల్లర్లకు ఉన్న బాయిల్డ్ రైస్ సమస్యతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లాలో ధాన్యం సేకరణ గణాంకాలను వివరిస్తూ.. ఈ యాసంగిలో 5.58 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 439 కేంద్రాలను ప్రతిపాదించగా ఇప్పటికే 330 కేంద్రాలను ప్రారంభించి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మిల్లర్ల సమస్య వల్ల నిలిచిపోయిన అన్‌లోడింగ్ ప్రక్రియ శుక్రవారం జరిగిన చర్చలతో పరిష్కారమైందని ఇకపై సేకరణ వేగవంతం అవుతుందని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ సందర్భంగా చైర్మన్‌కు సాదర స్వాగతం పలికారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదాబైనామాల పరిష్కారంపై చైర్మన్ అడిగిన వివరాలకు స్పందిస్తూ మార్చి 15 నాటికి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని, సాదాబైనామాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, వివిధ శాఖల అధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

బత్తాయి సాగుపై జిల్లా రైతులు దృష్టి సారించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News